News March 19, 2024
పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత
తనకు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కవిత అరెస్టైనందున ఆ పిటిషన్ నిరర్థకమైందని, అందుకే వెనక్కి తీసుకుంటున్నామని వారు వివరించారు. వారి విజ్ఞప్తిని పరిగణించిన ధర్మాసనం 11 గంటలకు కేసును పాస్ ఓవర్ చేసింది.
Similar News
News November 15, 2024
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ
తిలక్ వర్మ వరుసగా టీ20ల్లో రెండో సెంచరీ బాదారు. సౌతాఫ్రికాతో 4వ టీ20లో విధ్వంసం సృష్టించిన అతడు కేవలం 41 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. 9 సిక్సర్లు, 6 ఫోర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే అతడిచ్చిన 3-4 క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం తి‘లక్’కు కలిసొచ్చింది. కాగా 3వ టీ20లోనూ తిలక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సంజూ కూడా సెంచరీతో మెరవడంతో భారత్ 300 స్కోర్ దిశగా సాగుతోంది.
News November 15, 2024
సంజూ శాంసన్ మెరుపు సెంచరీ
సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ20లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ సూపర్(100*)సెంచరీతో మెరిశారు. 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే సంజూ ఫోర్లు, సిక్సర్లతో ప్రొటీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ సిరీస్‌లో సంజూకిది రెండో సెంచరీ. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (36) మెరుపు ఆరంభం అందించారు.
News November 15, 2024
ఇరాన్‌కు గట్టి దెబ్బే తగిలింది!
అక్టోబర్ చివర్లో ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇరాన్‌కు గట్టి దెబ్బే తగిలినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో ఉన్న అణ్వాయుధ పరిశోధన కేంద్రం ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది ఇరాన్‌కు పెద్ద దెబ్బ అని చెబుతున్నాయి. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చినందుకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ గతంలో దాడి చేయడం తెలిసిందే.