News February 4, 2025
సూర్యాపేట: తొలి రోజే 346 మంది డుమ్మా!

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1086 మంది హాజరుకావాల్సి ఉండగా 872 మంది మాత్రమే హాజరయ్యారు. 214 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 918 మందికి 883 మంది పరీక్షకు హాజరు కాగా 35 మంది హాజరుకాలేదు. మధ్యాహ్నం ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 985 మందికి 888మంది హాజరుకాగా 97 మంది ప్రాక్టికల్స్ రాయలేదు.
Similar News
News November 10, 2025
కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ, ఐటీ శాఖకు చెందిన 10కి పైగా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు సహా సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో పనుల పాలనా అనుమతులపై చర్చిస్తోంది.
News November 10, 2025
జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.