News February 4, 2025

మేడ్చల్: ఘట్‌కేసర్‌లో విషాదం.. ఒకరి మృతి

image

ఘట్‌కేసర్‌ ద్వారకానగర్‌లో విషాదం నెలకొంది. చిన్న చెరువు వద్ద ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాలు.. శేఖర్ మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవారు. దీంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ నెల 1న తండ్రి, అన్నదమ్ములతోనూ అతడు గొడవ పెట్టుకున్నాడు. అదే రోజు చిన్న చెరువు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు స్పాట్‌కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

Similar News

News March 7, 2026

కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల కోసం దరఖాస్తులు: సుగుణ

image

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులను నియమించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు. మార్చి 13లోపు మండల అధ్యక్షుల ఎంపిక, 23లోపు పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు మండల కేంద్రాల్లో నిర్వహించే సమావేశాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న నాయకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 7, 2026

కేయూలో రెండు రోజుల జాతీయ సదస్సు

image

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, కాకతీయ విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు ఈనెల 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో “literature, leadership and innovation women shaping viksith bharat – 2047”, అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని సంచాలకులు డాక్టర్ బి.దీపా జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు,

News March 7, 2026

తాడికొండలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

తాడికొండలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. Nine One Exchange యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్న కిరణ్, గోపీ, వంశీ, ప్రతాప్‌లను అదుపులోకి తీసుకుని 4 ఫోన్లు, కంప్యూటర్ సామగ్రి, ₹3,550 స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.