News February 4, 2025
నార్సింగి: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.
Similar News
News April 25, 2025
నర్సాపూర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

నర్సాపూర్ మండలం రుస్తుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News April 25, 2025
మెదక్: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన యువతి

సైబర్ మోసగాళ్ల వలలో పడి యువతి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి రూ.1000 చెల్లిస్తే రూ.600 కమిషన్ వస్తుందని ఆమెను నమ్మించాడు. విడతల వారీగా రూ.1.28 లక్షలు చెల్లించిన యువతి తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
News April 25, 2025
మెదక్ కలెక్టరేట్‌లో మహిళా వ్యాపారులకు అవగాహన

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు. కలెక్టరేట్‌లో వీ హబ్ ద్వారా జిల్లాలోని SHG మహిళలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ స్కీమ్) పై అవగాహన కల్పించారు.