News February 4, 2025

బాపట్ల: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

image

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

గ్రాముకు రూ.9వేల లాభం

image

RBI తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందించాయి. 2017 NOV 6న విడుదల చేసిన సిరీస్‌-VI బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,895గా(ఆన్‌లైన్‌లో ₹50 డిస్కౌంట్) నిర్ణయించారు. 8 ఏళ్ల కాలవ్యవధి పూర్తికావడంతో ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,066గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,121 లాభం వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం.

News November 6, 2025

సిరిసిల్ల: ‘రెండు రోజుల్లోగా సమర్పించాలి’

image

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, ఏఎన్ఎం పోస్టుల నియామకానికి సంబంధించిన లిస్టును అధికారిక వెబ్‌సైట్ https://rajannasiricilla.telangana.gov.in ప్రచురించామని జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా కలెక్టరేట్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు.

News November 6, 2025

SRD: జాతీయ సాహస శిబిరానికి ‘తార’ విద్యార్థిని

image

కేంద్ర యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీవిద్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ గురువారం తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 20 మంది విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా, శ్రీవిద్య అందులో ఒకరు. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు మనాలిలో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.