News February 4, 2025

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

image

చర్ల మండలం తాళిపేరు ప్రాజెక్టు తిప్పాపురం రోడ్‌లో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడని స్థానికులు చెప్పారు. మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఛత్తీస్గడ్ రాష్ట్రం జీడిపల్లికి చెందిన ముగ్గురు యువకులు, తిప్పాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News February 4, 2025

కులగణనతో బీసీల కల నెరవేరింది: పొన్నం

image

TG: కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఏళ్లుగా ఉన్న బీసీల కల నెరవేరిందని చెప్పారు. ఈ డేటా సేకరణ దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి రాజకీయ పార్టీ దీనిని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి గణన చేయలేదని, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని స్పష్టం చేశారు.

News February 4, 2025

పోలవరం కెపాసిటీ తగ్గించొద్దు: మిథున్ రెడ్డి

image

AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్‌సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.

News February 4, 2025

KMR: పోక్సో చట్టంపై ఓరియంటేషన్

image

కలెక్టరేట్ సముదాయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పోక్సో చట్టంపై అధ్యాపక సిబ్బందికి ప్రత్యేకమైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించినట్లు కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి ప్రమీల తెలిపారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆవిష్కరించారు. ఎస్పీ సింధు శర్మ, ఆయాశాఖల సిబ్బంది, అధ్యాపకులు, ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!