News February 4, 2025
నాలుగు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ!

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించింది.
Similar News
News March 19, 2026
ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000 పలుకుతోంది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు <<19423062>>బంగారం<<>> ధరలు కూడా ఇవాళ తగ్గిన విషయం తెలిసిందే.
News March 19, 2026
‘డోరేమాన్’ డైరెక్టర్ కన్నుమూత

‘డోరేమాన్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను అలరించిన ప్రముఖ డైరెక్టర్ సుటోము షిబాయామా(84) కన్నుమూశారు. కొంతకాలంగా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మార్చి 6న మరణించినట్లు జపనీస్ యానిమేషన్ స్టూడియో ఆసియా-డో ప్రకటించింది. కుటుంబసభ్యుల కోరిక మేరకు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. 1980 నుంచి 2004 వరకు డోరేమాన్ టీవీ యానిమేషన్ సిరీస్‌లకు ఆయన దర్శకత్వం వహించారు.
News March 19, 2026
ఆ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి జరగదు.. ఇరాన్‌కు ట్రంప్ హామీ

సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఖతర్‌పై ఇరాన్ అటాక్ చేయడంపై ట్రంప్ స్పందించారు. సౌత్ పార్స్ దాడితో USకు సంబంధం లేదని తెలిపారు. అలాగే ఆ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేయదని హామీ ఇచ్చారు. ఖతర్‌పై మరోసారి దాడులకు దిగితే మాత్రం ‘సౌత్ పార్స్’ను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అలా జరగడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. దీర్ఘకాలంలో ఇరాన్‌కు చాలా నష్టం అన్నారు.


