News February 4, 2025
GWL: నేటి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 వరకు జరగనున్నాయి. జమ్ములమ్మ మెట్టినిల్లు అయిన గుర్రం గడ్డ దీవి నుంచి ఎద్దుల బండి పై బుధవారం అమ్మవారి విగ్రహాన్ని జమ్మిచేడు ఆలయానికి తీసుకువస్తారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు.
Similar News
News March 21, 2026
ప్లే విత్ ఫైర్.. ప్లే విత్ పేషన్స్

మరో వారంలో IPL-19 ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో RCBని SRH ఢీకొట్టనుంది. ఈసారి సన్‌రైజర్స్ ‘PlayWithFire’ నినాదంతో బరిలోకి దిగుతోంది. ఫైర్ అవసరమే అయినా ఆ జట్టుకు ఓపిక(Patience) కూడా ఉండాలని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లు ఫైర్ చూపించాలని, మిడిల్ ఆర్డర్ పేషన్స్‌తో ఆడాలని కోరుతున్నారు. తద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించి, భారీ స్కోర్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మీరేమంటారు?
News March 21, 2026
రాజానగరం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు!

రాజానగరం జాతీయ రహదారి ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి వాడపల్లి వెళ్తుండగా వీరి కారును రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీఎస్‌ఎల్ ఆస్పత్రికి తరలించారు. కారులో డ్రైవర్‌తో సహా మొత్తం ఏడుగురు ఉండగా, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (58532) రైలు రీషెడ్యూల్ అయింది. మార్చి 21న సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, అనివార్య కారణాల వల్ల రాత్రి 6:50 గంటలకు బయలుదేరనుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.


