News February 4, 2025
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి: విశాఖ డీఐజీ

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో బందోబస్తు విధులు నిర్వహణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 3, 2026
శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో…?

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీల పాలకవర్గాలు పదవీకాలం గురువారంతో ముగిసింది. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మండల స్థాయి గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం మేరకు బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లాలో 912 పంచాయతీలు ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారనేది గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
News April 3, 2026
శ్రీకాకుళం: 5న R&B మినిస్టర్ రాక

రాష్ట్ర రహదారులు, భవనాలు(R&B) శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈనెల 5, 6వ తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న జిల్లాకు వస్తారని చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్‌పై సమీక్షా సమావేశం 6న నిర్వహిస్తారన్నారు.
News April 3, 2026
శ్రీకాకుళంలో బీర్లు ఎక్కువగా తాగేస్తున్నారు..!

శ్రీకాకుళం జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1207.91 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 16.97లక్షలు కాగా.. బీరు బాక్సులు రూ.8.06లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1213.06కోట్ల విక్రయాలు జరిగాయి. గతంలో పోలిస్తే 2025-26లో అమ్మకాలు పెరగలేదు. 2024-25లో బీర్లు 5.19లక్షల బాక్సులు అమ్ముడుపోగా.. 2025-26లో ఆ సంఖ్య 8.06లక్షలకు పెరిగింది.


