News February 4, 2025
మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.
Similar News
News March 3, 2026
పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ సూచించారు.
News March 3, 2026
శ్రీరంగాపురం: గ్రహణం వేళ రంగనాథుని ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయ ద్వారాలను మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతం జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను యథావిధిగా ఘనంగా కొనసాగిస్తామని ఆలయ పూజారులు, అధికారులు వెల్లడించారు.
News March 3, 2026
డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.


