News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం..!

image

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటె‌క్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.

News September 3, 2025

జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్

image

జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.