News February 4, 2025

సీనియర్ నటికి గాయం

image

సీనియర్ నటి కుష్బూ సుందర్ గాయపడ్డారు. చేతికి కట్టుతో ఉన్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూసినా ఆగిపోవద్దని, చిరునవ్వుతో ముందుకు సాగాలని రాసుకొచ్చారు. కాగా ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News March 19, 2026

IPL: సన్‌రైజర్స్ ప్లేయింగ్-11 ఇదేనా?

image

IPL-2026: SRH మార్చి 28న ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం తుది జట్టు..
SRH: హెడ్, అభిషేక్, ఇషాన్ (C), క్లాసెన్ (WK), లివింగ్‌స్టన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్షల్, ఉనద్కత్, జీషన్ అన్సారీ.
> స్మరణ్, అరోరా, కమిందు మెండిస్, హర్ష్ దూబే, శివంగ్, ఫులేట్రా, ఎడ్వర్డ్స్, ఎషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, మావి అనే ప్లేయర్లూ ఉన్నారు.

News March 19, 2026

ఆయిల్ టెన్షన్.. ₹10లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 2496 పాయింట్లు కోల్పోయి 74,207 వద్ద సెటిల్ అవగా నిఫ్టీ 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద సెటిల్ అయింది. ₹10లక్షల కోట్లకుపైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రెంట్ క్రూడ్ 118.14 డాలర్లకు, ముర్బాన్ క్రూడ్ 128.84 డాలర్లకు చేరడం మార్కెట్లను కుదిపేసింది. FII సెల్లింగ్, HDFC బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.

News March 19, 2026

2 నౌకల్లోని LPGతో ఎన్ని సిలిండర్లు నింపొచ్చో తెలుసా?

image

యుద్ధం వేళ హార్ముజ్ జలసంధిని దాటుకుని భారత్‌కు వచ్చిన శివాలిక్, నందాదేవి నౌకల్లో 92,712 మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని ద్వారా 65.3 లక్షల డొమెస్టిక్ సిలిండర్లను నింపొచ్చు. భారత్‌లో సగటున రోజుకు 55.7 లక్షల సిలిండర్లను రీఫిల్ చేసుకునేందుకు బుకింగ్స్ చేసుకుంటారు. ఇండియాకు చెందిన మొత్తం 22 నౌకలు ఇప్పటికీ ఆ జలసంధిలో చిక్కుకొని ఉన్నాయి. వాటిలో క్రూడాయిల్, LPG, LNG తదితర గ్యాస్ నిల్వలు ఉన్నాయి.