News February 4, 2025

ఇల్లందు: మట్టి పెళ్లలు పడి కార్మికుడు మృతి

image

ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య(40) మట్టి పెళ్లలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

Similar News

News November 14, 2025

PDPL: శాండ్ రీచ్‌లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

image

పెద్దపల్లి జిల్లాలోని 19 శాండ్ రీచ్‌లు ఆగిపోవడంతో ప్రభుత్వం ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయం కోల్పోతుంది. సహజ సంపదను తోడేయడంతో జీవవైవిధ్యం దెబ్బతింటుందంటూ మానేరు పరివాహక పరిరక్షణ సమితి NGTని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన NGT.. శాండ్ రీచ్‌లను నిలిపివేయాలని కలెక్టర్‌కు 2023లో ఆదేశాలు జారీచేసింది. అయితే ఈనెలలో NGT స్టేను వెకేట్ చేసి రీచ్‌లను ఓపెన్ చేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 14, 2025

WGL మార్కెట్‌కు తేజ షార్క్ కొత్త మిర్చి రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం తేజ షార్క్ కొత్తమిర్చి 8 బస్తాలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. క్వింటాకు రూ.15,111 ధర వచ్చిందన్నారు. అలాగే టమాటా మిర్చి సైతం నేడు మార్కెట్‌కు రాగా రూ.30 వేల ధర పలికిందని చెప్పారు. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా రూ.2,075 ధర వచ్చింది.

News November 14, 2025

ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

image

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.