News February 4, 2025
ఊట్కూర్: గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో చోరీ

ఊట్కూరు మండల కేంద్రంలోని గ్రామదేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. అర్చకులు భీమయ్య నిత్య పూజలో భాగంగా ఈరోజు ఉదయం ఆలయానికి వచ్చి చూడగా, గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం తాళం విరగొట్టి ఆలయంలోకి చొరబడి 4 పెద్ద గంటలు, హారతి పళ్లెం, హుండీ, అమ్మవారి వెండి వస్తువులు, 5 దీప జ్యోతులు అపహరించినట్లు తెలిపారు.
Similar News
News October 31, 2025
PRG: ఉ‘సిరి’కి భారీ డిమాండ్

పరిగి పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పరిగి మార్కెట్‌లో 250గ్రా. ఉసిరి రూ.30-50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 31, 2025
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.
News October 31, 2025
వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.


