News February 4, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.2గా ఉంది.
Similar News
News November 6, 2025
226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.
News November 6, 2025
‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం (2/2)

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.


