News February 4, 2025
సూర్యాపేట: కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం

BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు వర్షిత్‌రెడ్డి నియామకంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Similar News
News September 16, 2025
ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
News September 16, 2025
HYDలో రోడ్డు సేఫ్టీ సమ్మిట్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!

HYD సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18,19వ తేదీలలో ఉ.10 గంటలకు జలవిహార్ వాటర్ పార్క్ వద్ద హైదరాబాద్ ట్రాఫిక్& రోడ్ సేఫ్టీ సమ్మిట్ 2025 నిర్వహించనున్నట్లుగా హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. పాల్గొనాలనుకునే వారు వెబ్‌సైట్ hcsc.in ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
News September 16, 2025
రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.