News February 4, 2025

వరంగల్ మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే మంగళవారం పత్తి ధర తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. నేడు రూ.40 తగ్గి, రూ.6,960 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర తగ్గడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News March 22, 2026

సూర్యలంక బీచ్‌కి పోటెత్తిన పర్యాటకులు

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో ఆదివారం పర్యాటకుల తాకిడి అధికంగా మారింది. రంజాన్ మరసటి రోజు ముస్లింలు సముద్ర తీరాలకు అధికంగా విచ్చేస్తారు. అదేవిధంగా ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు బాపట్ల మండలం విచ్చేయడంతో సముద్రతీరం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. తీరం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 22, 2026

ADB: ఈ నెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.

News March 22, 2026

హన్మకొండ: 11 మందిలో గెలిచింది ఒక్కడే!

image

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎం సహోదర రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో న్యాయవాది సహోదర్ రెడ్డి 1085 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సహోదర్ రెడ్డి విజయంతో వరంగల్ కోర్టులో సంబరాలు నెలకొన్నాయి.