News February 4, 2025
ఎంజీయూ ఆధ్వర్యంలో ఐసెట్ నిర్వహణ
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కొరకు నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) -2025ను ఈ ఏడాది నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ కన్వీనర్ అల్వాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐసెట్ నోటిఫికేషన్ ను మార్చి 6వ తేదీన విడుదల చేసి జూన్ 8, 9 తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 4, 2025
NLG: తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు
వరంగల్ – ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని తెలిపారు.
News February 4, 2025
క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ చర్యలు: నాగం వర్షిత్ రెడ్డి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ చర్యలు చేపడతామని బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు. జిల్లాలో పార్టీ అసంతృప్తులను కలుపుకొని పోతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
News February 4, 2025
NLG: కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం
BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు వర్షిత్‌రెడ్డి నియామకంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.