News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం..!

image

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటె‌క్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News September 7, 2025

చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత

image

నేడు చంద్రగ్రహణం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు మూసి ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తామని పండితులు తెలిపారు.

News September 7, 2025

HYDలో గణేశుడి లడ్డూకు మస్త్ క్రేజ్

image

HYDలో గణపతి లడ్డూ వేలం పాట ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. నవరాత్రుల పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడి ప్రసాదం కోసం భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో వేలం రూ.వేలు, లక్షల నుంచి కోట్లకు దాటిపోతోంది. ఈ ఏడాది అత్యధికంగా పలికిన లడ్డూ వేలం ఇలా.. 1.బండ్లగూడ జాగీర్(కీర్తీ రిచ్‌మైండ్స్) రూ.2.32 కోట్లు, 2. రాయదుర్గం(మై హోం భూజా) రూ. 51 లక్షలు, 3.బాలాపూర్‌ లడ్డూ రూ.35 లక్షలు, 4.మాదాపూర్‌(శ్రీనగర్ యూత్)లో రూ.30 లక్షలు

News September 7, 2025

HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

image

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.