News February 4, 2025

తిరుపతి SVU దగ్గర 144 సెక్షన్

image

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికారులకు సవాల్‌గా మారింది. నిన్ననే ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేక వాయిదా పడింది. తమ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేశారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. కార్పొరేటర్ల బస్సుకు భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరికాసేపట్లో ఎస్వీయూ దగ్గరకు కార్పొరేటర్లు రానున్నారు. ఈ నేపథ్యంలో SVU దగ్గర 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు.

Similar News

News September 15, 2025

విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

image

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 15, 2025

నంద్యాల: కేశవరెడ్డి స్కూల్‌పై ఫిర్యాదు

image

నెరవాడలోని కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై గడివేముల మండలం కరిమద్దెలకు చెందిన బచ్చు చక్రపాణి నంద్యాల కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేశవరెడ్డి స్కూల్లో తమ ఇద్దరు కుమార్తెలు చదివించడానికి రూ 5.లక్షలు డిపాజిట్ చేశానన్నారు. చదువు పూర్తయిన తర్వాత అమౌంట్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వడం లేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరారు.

News September 15, 2025

ఈనెల 17న విశాఖకు సీఎం.. షెడ్యూల్ ఇదే

image

ఈనెల 17న సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ఉ.11.15 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో, మ.12గంటలకు స్వస్త్ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. సా.3గంటలకు హోటల్ రాడిసన్ బ్లూలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని, సా.5గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.