News February 4, 2025

నెల్లూరు:ల్యాబ్ టెక్నీషియన్ల సమీక్షా సమావేశం

image

అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్‌లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు పాల్గొన్నారు.

Similar News

News February 4, 2025

నెల్లూరు రానున్న ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ 

image

రెండు రోజులు నెల్లూరు జిల్లాలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. 4వ తేదీన జిల్లాలోని కోవూరు, కందుకూరు నియోజకవర్గాల్లో క్షేత్ర పరిశీలన అనంతరం రాత్రికి నెల్లూరులోనే బస చేస్తారు. 5వ తేదీ నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో 11 గంటల వరకు క్షేత్ర పరిశీలన జరగనున్నట్లు షెడ్యూల్‌లో తెలిపారు.

News February 4, 2025

డిప్యూటీ మేయర్‌ను అభినందించిన మంత్రులు

image

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన తహసీన్‌ను నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలిసి అభినందించారు, ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర కార్పొరేషన్‌లో తొలిసారి ముస్లిం మైనారిటీ మహిళను ఎన్నుకోవడం చారిత్రాత్మకమన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న మంత్రి పొంగూరు నారాయణను అభినందించారు

News February 3, 2025

నెల్లూరు: ‘ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి’

image

5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరు ఆర్ఐవో డా. శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో సంబంధిత ఎగ్జామినర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రాక్టికల్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.  

error: Content is protected !!