News March 19, 2024
కాకినాడ చరిత్రలో 1983లో అత్యధికం.. ఈ సారి ఛాన్స్ ఉందా.?

కాకినాడ పట్టణ నియోజకవర్గానికి 1952- 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి మల్లాడిస్వామిపై అత్యధికంగా 55631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. మళ్లీ అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదైనా.. ఆ నాటి మెజారిటీని కొల్లగొట్టేనా..?
Similar News
News December 29, 2025
ఈనెల 30న కలెక్టరేట్‌లో వర్క్ షాప్: జేసీ

నూతన ఆవిష్కరణల ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లను బలోపేతం చేసేందుకు ఈనెల 30న బొమ్మూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు జేసీ మేఘా స్వరూప్ తెలిపారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC), RTIH సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ వంటి కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని జేసీ పేర్కొన్నారు.
News December 29, 2025
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి పదోన్నతి

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
2013 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా ఎస్పీగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ విభాగ అధికారిగా పనిచేశారు. అనంతరం తూ. గో జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి రావడంతో ఏఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఇతర సిబ్బంది అభినందించారు.
News December 29, 2025
రాజానగరంలో రేపు ‘జాబ్ మేళా’

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 30 మంగళవారం రాజానగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల ప్రజా పరిషత్ స్కిల్ హబ్ ప్రాంగణంలో ఉదయం 10:30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 19 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండి.. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.


