News February 4, 2025

బాపట్ల: నగ్న చిత్రాల పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా.. అరెస్ట్

image

అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన దేవనాయక్‌‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు నిడదవోలు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. నిందితుడి నుంచి రూ. 1.84 కోట్లు నగదు, ఆస్తులను సీజ్ చేశామన్నారు.

Similar News

News March 24, 2026

BIG NEWS: నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

image

లోక్‌సభ, శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సెగ్మెంట్లను 50% పెంచి, మహిళలకు 33% రిజర్వేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సెషన్‌లోనే బిల్లును ప్రవేశపెట్టనుందని సమాచారం. పునర్విభజనతో లోక్‌సభ సీట్లు 816కు చేరే అవకాశం ఉంది. APలో MLA సీట్లు 262-263కి, LS స్థానాలు 37-38కి, TGలో MLA సీట్లు 178-179కి, LS స్థానాలు 25-26కు చేరనున్నాయి.

News March 24, 2026

చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

image

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.

News March 24, 2026

అనంతలో గ్యాస్ కష్టాలు

image

అనంతపురం జిల్లా ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. బుక్ చేసినా సకాలంలో డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి పది రోజులవుతున్నా ఇంకా ఇంటికి చేరలేదని తాడిపత్రికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.