News February 4, 2025
ములుగు జిల్లాలో సీడీపీఓ ఆత్మహత్యాయత్నం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీడీపీఓ ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం ఉదయం పాలు తీసుకువచ్చిన కార్ డ్రైవర్ సీడీపీవో ఇంట్లో స్పృహ తప్పి ఉండడం చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 22, 2026
VZM: ప్రభుత్వ సేవల్లో శతశాతం సానుకూల స్పందనే లక్ష్యం

ప్రభుత్వ సేవల్లో ప్రజల నుంచి శతశాతం సానుకూల స్పందన రావాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ సేవలు, ప్రజా స్పందనపై గురువారం చర్చించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. వసతిగృహాల్లో సేవలపై ప్రజా స్పందన తక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలని సూచించారు.
News January 22, 2026
సమస్యల పరిష్కారమే దర్బార్ ధ్యేయం: సురేఖ

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయంలో 1942 నుంచి దర్బార్ కొనసాగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. దర్బార్ ప్రధాన ఉద్దేశం ఆదివాసీల సమస్యల పరిష్కారమేనని స్పష్టం చేశారు. అటవీ భూములు, పోడు భూముల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో రహదారులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
News January 22, 2026
WPL: ఓడితే ఇంటికే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో మ్యాచులు రసవత్తరంగా మారాయి. RCB(10 పాయింట్లు) మినహా MI, UP, DC, GG నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ జట్లన్నీ తమ తదుపరి మ్యాచులన్నీ తప్పక గెలవాలి. లేదంటే ఇంటిబాట పడతాయి. ఇవాళ యూపీ-గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన యూపీ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ వేళ ఈ మ్యాచ్ ఇరుజట్లకూ చావో రేవో కానుంది.


