News March 19, 2024
కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న సిద్ధూ

భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో స్టార్‌స్పోర్ట్స్ కామెంట్రీ బాక్స్‌లో సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధూ ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్‌లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
Similar News
News March 13, 2026
ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <
News March 13, 2026
పంత్ మరో అభిషేక్ అవుతాడా?

LSG కెప్టెన్ రిషభ్ పంత్ గత IPL సీజన్‌లో బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. RCBపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయారు. దీంతో ఈసారి యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల 4 రోజులపాటు ముంబైలో బ్యాటింగ్ సెషన్లు జరిగాయి. గతంలో అభిషేక్ శర్మ, గిల్, ప్రభ్‌సిమ్రాన్ వంటి బ్యాటర్లకు యువీ శిక్షణనిచ్చారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌లా పంత్ రాణిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.


