News February 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.
Similar News
News November 7, 2025
రిజర్వ్ ఫారెస్ట్‌లో నగర వనం: డీఎఫ్‌వో

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్‌తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.
News November 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే
> బ్రిడ్జ్ నిర్మించాలని సీపీఎం నేతల ధర్నా
> విద్యార్థులతో వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే కడియం
> వరి పంటలను పరిశీలించిన కలెక్టర్
> బచ్చన్నపేట: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
> జనగామలో డివైఎఫ్ఐ 46వ దినోత్సవ వేడుకలు
> కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
News November 7, 2025
నిడదవోలు: పీఎంజేవైలో 757 ఇల్లు మంజూరు

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత వాసులకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి ఎం. బుజ్జి తెలిపారు. ఆమె గురువారం నిడదవోలు మండలంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పీఎంఏవై పథకం కొత్త మార్గదర్శకాలు విడుదలైనట్లు ఆమె పేర్కొన్నారు. నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ గృహాలు అందుతాయని వెల్లడించారు.


