News March 19, 2024
తలమడుగు: పురుగుల మందు తాగి వ్యక్తి SUICIDE

తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశరెడ్డి (55) అనే రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంట దిగుబడి రాక.. బ్యాంకు అప్పులు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
ADB: కేంద్రం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలి: సోయం

చట్ట బద్దత లేని లంబాడీలు ఎస్టీలు కాదని, కేంద్ర ప్రభుత్వం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయకేలను కలిసి నివేదిక అందజేశారు. తగిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను మంత్రులకు అందజేశామని పేర్కొన్నారు.
News January 7, 2026
ADB: కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి ఒక్క కేసులో నిందితులు కోర్టుకు హాజరు అయ్యేవిధంగా సమన్లను జారీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోవడానికి లేకుండా చూడాలన్నారు. కోర్టుకు హాజరు కాని వారిపై ఎన్‌బీడబ్ల్యూలను తీసుకొని తగు చర్యలను చేపట్టాలన్నారు. కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు.
News January 7, 2026
ADB: ఓటరు జాబితాలో లోపాలు ఉండొద్దు: ఎస్ఈసీ కమిషనర్

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా కమిషనర్‌కు వివరించారు.


