News February 4, 2025

క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం: బాపట్ల కలెక్టర్

image

క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పేర్కొన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుంచి అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.

Similar News

News September 13, 2025

HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

image

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.

News September 13, 2025

6 లైన్ల రోడ్డు: బీచ్ రోడ్ To భోగాపురం.. వయా భీమిలి..!

image

భోగాపురం ఎయిర్‌పోర్టుతో సిటీకి కనెక్టెవిటీ పెంచేందుకు బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రోడ్డు స్థానిక రాజకీయ నాయకుల భూమి విలువలు పెరగడానికి అవకాశం కల్పించిందని విమర్శలొచ్చాయి. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలోనే రోడ్డు నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం.

News September 13, 2025

‘గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా’

image

గాంధీ ఆసుపత్రిని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఆసుపత్రిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తిగా పరిశీలించి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.