News February 4, 2025

జగిత్యాల: యాక్సిడెంట్.. బ్యాంక్ ఉద్యోగి మృతి

image

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్‌ DCRBలో పనిచేస్తున్న <<15356057>>ఎస్‌ఐ శ్వేత మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. బైక్‌పై ఉన్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Similar News

News April 4, 2026

పార్వతీపురం మన్యం జిల్లాకు నాలుగేళ్లు

image

పార్వతీపురం మన్యం జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2022 ఏప్రిల్ 4న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాగాలతో పార్వతీపురం ప్రధాన పరిపాలనా కేంద్రంగా 4 నియోజకవర్గాలతో దీనిని ఏర్పాటు చేశారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏలు జిల్లాలో ఉన్నాయి. తోటపల్లి బ్యారేజీ, అడలి వ్యూ పాయింట్, దలైవలస తదితరవి ప్రసిద్ధి. మరి ఈ నాలుగేళ్లలో జిల్లా అభివృద్ధిపై మీ కామెంట్.

News April 4, 2026

నంద్యాల జిల్లాకు నాలుగేళ్లు

image

నంద్యాల జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2022 ఏప్రిల్ 4న పాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాను విభజించి దీనిని ఏర్పాటు చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ జిల్లాలో శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పరిపాలన వికేంద్రీకరణతో జిల్లా ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

News April 4, 2026

చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

image

AP: పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని CM చంద్రబాబు MLAలకు తేల్చిచెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రీసెంట్‌గా నరసారావుపేట MLA అరవింద బాబు తనకు కావాల్సిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదని రచ్చ చేసిన నేపథ్యంలో CM ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.