News February 4, 2025

జగిత్యాల: యాక్సిడెంట్.. బ్యాంక్ ఉద్యోగి మృతి

image

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్‌ DCRBలో పనిచేస్తున్న <<15356057>>ఎస్‌ఐ శ్వేత మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. బైక్‌పై ఉన్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Similar News

News November 13, 2025

ఛైర్మన్ హోదాలో నేనే పర్యవేక్షిస్తా: సీఎం చంద్రబాబు

image

9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే మోడల్ అని అన్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి విడుదల చేశారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా, భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.

News November 13, 2025

అనుమానమే పెనుభూతం.. మహిళ హత్య కేసులో సంచలనాలు.!

image

విజయవాడలో పట్టపగలే భార్యను కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన <<18275922>>కలకలం రేపింది<<>>. కృష్ణా (D)నాగాయలంకకు చెందిన విజయ్, నూజివీడుకు చెందిన నర్సు సరస్వతిని 4ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఏడాది క్రితం విడిపోగా, భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్ ఆమెను హత్యచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

News November 13, 2025

మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

image

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>