News February 4, 2025
అమెరికా x చైనా: యుద్ధం మొదలైంది!

రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గు, LNG ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్‌పై 10% సుంకాలు ప్రకటించింది. Feb 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ వేసిన 10% టారిఫ్స్ శనివారం నుంచి అమల్లోకి రావడంతో ప్రతీకారానికి దిగింది.
Similar News
News December 28, 2025
నాగర్‌కర్నూల్: రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధమైందని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రదర్శనను కలెక్టర్ బడావత్ సంతోష్ ప్రారంభించనున్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం 19 కమిటీలను ఏర్పాటు చేసి, బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News December 28, 2025
నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పటినుంచంటే?

TG: 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్) 2026 వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమై FEB 15 వరకు కొనసాగనుందని చెప్పారు. ఇన్నోవేషన్, ట్రెడిషన్‌తోపాటు సరసమైన ధరలకే అన్నీ వస్తువులు దొరుకుతాయన్నారు. ఈసారి సేఫ్టీ, యాక్సెసబిలిటీ, మహిళా వ్యాపారస్థుల కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నుమాయిష్ తప్పక సందర్శించాల్సిన సంప్రదాయంగా మారిపోయిందని ట్వీట్ చేశారు.
News December 28, 2025
కర్ణాటక రాజకీయాల్లో KC చిచ్చు.. BJP ఫైర్

బెంగళూరులో అక్రమ కట్టడాల కూల్చివేత కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్ జోక్యం చేసుకోవడంపై BJP మండిపడింది. ఆయన్ను ‘సూపర్ CM’గా అభివర్ణిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీ ఆదేశాలతో నడుస్తోందని విమర్శించింది. రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకోవడం సమాఖ్య వ్యవస్థను అవమానించడమేనని ప్రతిపక్ష నేత అశోక ధ్వజమెత్తారు.


