News February 4, 2025
రామగుండం: సింగరేణి కార్మికులకు క్యాష్ ప్రైజ్.. ఎందుకంటే..?

మరో 2 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో టార్గెట్ రీచ్ అయితే కార్మికులకు క్యాష్ ప్రైజ్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రాంతాల వారీగా, గనుల వారీగా లక్ష్యాన్ని చేరుకుంటే నగదు బహుమతులను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ అవకాశాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు కల్పించింది.
Similar News
News July 9, 2025
జనగామ: కష్టపడి ఈ స్థాయికి వచ్చా: డీఈఓ

కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని జనగామ డీఈఓ భోజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాడు సౌకర్యాలు లేకున్నా కష్టపడి చదివానని, నేడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News July 9, 2025
HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
News July 9, 2025
అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.