News February 4, 2025
పెద్దపల్లి జిల్లా.. ఉష్ణోగ్రతల వివరాలు

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో అత్యల్పంగా కాల్వ శ్రీరాంపూర్‌లో 17.5℃, ఓదెల 17.5, జూలపల్లి 17.5, సుల్తానాబాద్ 17.7, ఎలిగేడు 17.7, రామగుండం 17.8, అంతర్గాం 17.9, మంథని 18.0, కమాన్పూర్ 18.3, ధర్మారం 18.3, పెద్దపల్లి 18.6, పాలకుర్తి 18.6, రామగిరి 20.2, ముత్తారం 21.8℃గా నమోదయ్యాయి.
Similar News
News March 16, 2026
నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
News March 16, 2026
9/11 తరహా ఉగ్రదాడికి కుట్ర.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

ఉగ్రదాడికి ఎప్‌స్టీన్ నెట్‌వర్క్ కుట్ర పన్నిందని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఎప్‌స్టీన్ నెట్‌వర్క్‌లో మిగిలిన సభ్యులు USలో 9/11 తరహా ఘటనను క్రియేట్ చేసి, దానికి ఇరాన్‌ను నిందించాలని ప్లాన్ చేసినట్లు విన్నాను. మేం ఇలాంటి వాటికి వ్యతిరేకం. మా యుద్ధం US ప్రజలతో కాదు’ అని ట్వీట్ చేశారు. 2001 SEP 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన దాడిలో 3వేల మంది చనిపోయారు.
News March 16, 2026
కృష్ణా: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. జిల్లాలో 148 కేంద్రాలు

నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 148 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,232 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 148 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 148 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు 1500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.


