News March 19, 2024

అనంత: దొంగతనానికి వచ్చి..  విగత జీవిగా మారాడు

image

బత్తలపల్లి సమీపంలోని నార్సింపల్లి రోడ్డు వద్ద సోమవారం పొలంలో విద్యుత్ తీగలు చోరీ చేయడానికి వచ్చి శ్రీరాములు(32) అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని బత్తలపల్లి ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. బాధితుడు పుట్టపర్తి మండలం ఎనుములపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించమన్నారు. కుటుంబ సభ్యులతో గొడవపడి గత ఆరు నెలలుగా ఇంటికి వెళ్లడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 4, 2025

జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మంది ఎంపిక

image

అనంతపురం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా వీరికి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

News September 4, 2025

మిలాద్-ఉన్-నబీ పర్వదినాన పటిష్ఠ చర్యలు: ఎస్పీ

image

ఈనెల 5న జరిగే మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించి, మతసామరస్యంతో పండుగ ర్యాలీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ముస్లింలు నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.

News September 3, 2025

అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..!

image

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. పామిడిలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ, ఆత్మకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉప్పరపల్లి శైలజ, గుత్తి మండలం అబ్బేదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బండి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈనెల 5న సీఎం చేతుల మీదుగా విజయవాడలో అవార్డులు అందుకోనున్నారు.