News February 4, 2025
అవసరమైతే జైలుకైనా పోతా: ఎమ్మెల్యే దానం
TG: పేదల ఇళ్లు కూల్చుతా అంటే ఊరుకోబోమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. కూల్చివేతల విషయమై తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. తన ఇంట్లో అభిమానించే వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.
Similar News
News February 4, 2025
తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!
స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.
News February 4, 2025
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు.
News February 4, 2025
అమ్మాయిలూ.. జాగ్రత్త!
సోషల్ మీడియాలో పరిచయమవుతున్న అపరిచితులు స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని TSRTC సజ్జనార్ పేర్కొన్నారు. తెలియని వాళ్లతో చనువుగా ఉండి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. ‘అజ్ఞాత వ్యక్తులతో స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే మీకే నష్టం. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లని ఫాలో అవ్వడం, వారితో చాట్ చేయకండి’ అని యువతకు సందేశం ఇచ్చారు.