News February 4, 2025

నేడు వరల్డ్ క్యాన్సర్ డే!

image

కాన్సర్‌పై అవగాహన, దాని నివారణ, గుర్తింపు, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీనిని ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. భారతదేశంలో ఏటా సగటున 11 లక్షల మందికి ఇది సోకుతుండగా 2023లో 14.96లక్షల మందికి పైగా చనిపోయారు. రొమ్ము, గర్భాశయ, లంగ్, బ్లడ్, నోటి క్యాన్సర్ వంటివి ఎక్కువగా సోకుతున్నాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

Similar News

News February 4, 2025

వన్డే జట్టులోకి మిస్టరీ స్పిన్నర్

image

ఇంగ్లండ్‌తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న వరుణ్‌ ఈ సిరీస్‌‌లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.

News February 4, 2025

తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!

image

స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.

News February 4, 2025

తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు.

error: Content is protected !!