News February 4, 2025
తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి
AP: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. ఆయనకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది సభ్యులు ఓటు వేశారు. అటు నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా TDP అభ్యర్థి, పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి ఎన్నికయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులను కాదని ఈమెకు పార్టీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.
Similar News
News February 4, 2025
తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!
స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.
News February 4, 2025
తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు. మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు? బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు?’ అని మండిపడ్డారు.
News February 4, 2025
అమ్మాయిలూ.. జాగ్రత్త!
సోషల్ మీడియాలో పరిచయమవుతున్న అపరిచితులు స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని TSRTC సజ్జనార్ పేర్కొన్నారు. తెలియని వాళ్లతో చనువుగా ఉండి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. ‘అజ్ఞాత వ్యక్తులతో స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే మీకే నష్టం. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లని ఫాలో అవ్వడం, వారితో చాట్ చేయకండి’ అని యువతకు సందేశం ఇచ్చారు.