News February 4, 2025
బషీరాబాద్‌లో దారుణ హత్య

బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 8, 2026
బాపట్ల: వేతనాల కోసం పోరాటం.. సస్పెన్షన్ వేటు..!

జిల్లాలో గ్రామ సర్వేయర్ల కనీస వేతనాలపై అసంతృప్తితో చేపట్టిన సహాయక నిరాకరణ ఉద్యమం వివాదాస్పదంగా మారింది. ఈ ఉద్యమాన్ని ఖండిస్తూ అధికారులు బాపట్ల జిల్లా విలేజ్ సర్వేయర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ నాయక్, జనరల్ సెక్రటరీ కళ్యాణ్ వర్మలను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ సర్వేయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది. ఈనెల 5న ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఈ వారంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు చేసిన సిట్.. కోర్టులో అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.


