News February 4, 2025

కర్నూలు జిల్లాలో టీడీపీలోకి 500 వైసీపీ కుటుంబాలు

image

కర్నూలు జిల్లా కోడుమూరు, ఆలూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. సుమారు 500 వైసీపీ కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చకున్నాయి. కోడుమూరు వైసీపీ నేత ఎరుకల లింగన్న ఆధ్వర్యంలో మూడు నియోజకవర్గాల నుంచి టీడీపీలో చేరారు. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని వారికి కోట్ల హామీ ఇచ్చారు.

Similar News

News March 15, 2026

కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

image

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.

News March 15, 2026

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

News March 15, 2026

కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.