News February 4, 2025
మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News September 19, 2025
VZM: స్పీకర్‌తో మహిళ ప్రజా ప్రతినిధుల భేటీ

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశాల ప్రాధాన్యం, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై వారు చర్చించారు. సభా కార్యక్రమాలు విజయవంతంగా సాగేలా సహకారం అందిస్తామని తెలిపారు.
News September 19, 2025
5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.
News September 19, 2025
కెరమెరిలో చెక్‌పోస్ట్ తనిఖీ

కెరమెరి మండలం ఎస్సాపూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌ను ఈరోజు ఎఫ్ఆర్ఓ మజహరుద్దీన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన ఆయన చెక్‌పోస్ట్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని రికార్డులు నమోదు చేయాలన్నారు. స్మగ్లర్లు వర్షాకాలాన్ని అదునుగా చేసుకొని స్మగ్లింగ్ పెంచే ప్రమాదం ఉందని, సిబ్బంది ప్రత్యేక నిఘాపెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు.అడవి, వన్యప్రాణులను నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.