News February 4, 2025
మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 10, 2025
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి: ఎస్పీ

ప్రజావాణి ఫిర్యాదులపై పోలీసు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 8 ఫిర్యాదులు వచ్చాయని.. అందులో భూతగాదాలు-04, పరస్పర గొడవలకు సంబంధించి-4 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు.
News November 10, 2025
నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.
News November 10, 2025
మార్కెట్‌కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్‌లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్‌ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.


