News February 4, 2025
వికారాబాద్ ప్రజలకు ALERT

ఇటీవల వాట్సాప్‌లో వస్తున్న APK లింకులను టచ్ చేయకూడదని పలు మండలాల ఎస్ఐలు సూచిస్తున్నారు. అయినప్పటికీ మొబైల్ ఫోన్లు తమ పిల్లలకు ఇవ్వడంతో APK లింకులను టచ్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారని సూచిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని.. ఇప్పటికైనా వాట్సాప్ గ్రూపులో వచ్చే ఎలాంటి లింకులు ఓపెన్ చేయకూడదని అనుమానం వస్తే పోలీసులకు తెలపాలని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్‌కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్‌ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్

ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,020 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు స్థిరమైన విద్యుత్ సదుపాయం కల్పించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.


