News February 4, 2025
వర్గీకరణపై వాస్తవాలతో ముందుకెళ్లండి: వివేక్

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ అంశంపై ఊహాజనితంగా కాకుండా వాస్తవాల ప్రాతిపదికన వెళ్లాలని కోరారు. తాము మాలల సమావేశం పెట్టుకుంటే తప్పేంటన్న ఆయన మాదిగలు, రెడ్లు, బీసీలు సమావేశాలు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ ఎందుకు పట్టుబట్టట్లేదని నిలదీశారు.
Similar News
News March 27, 2026
సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే

TG: ఇకపై దరఖాస్తు చేసేటప్పుడు భూమిని బదిలీ చేసే వ్యక్తి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుడి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ సరిపోతుంది. తప్పుడు సమాచారం/పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ‘భూ భారతి’లో నమోదుకు ముందు ఎవరైనా అభ్యంతరాలు తెలిపేందుకు 30days గడువుంటుంది. 5ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
News March 27, 2026
అమరావతిలో మంటలు.. సెక్యూరిటీ గార్డే నిందితుడు?

AP: <<19480669>>అమరావతిలో<<>> పైపుల దహనం కేసులో మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌పై కోపంతో సెక్యూరిటీ గార్డు రాము నిప్పంటించినట్లు సమాచారం. రోజూ 12 గంటల డ్యూటీ, సెలవు ఇవ్వకపోవడంతో రాము కొన్నిరోజులుగా కోపంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారని మంటలు పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
News March 27, 2026
మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


