News February 4, 2025
PHOTO: కొత్త లుక్లో సమంత
స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్లో దర్శనమిచ్చారు. బాయ్ తరహాలో ఉన్న ఆమె లుక్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మ్యాగజైన్ కోసం ఆమె పోజులిచ్చినట్లు తెలుస్తోంది. కాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆమె కాస్త బక్కచిక్కారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.
Similar News
News February 4, 2025
రేపు మహాకుంభమేళాకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ రేపు(FEB 5) ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ఆయన పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. అటు రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మహాకుంభమేళాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
News February 4, 2025
భారతీయులకు మొబైల్ వ్యసనంగా మారిందా?
పై ప్రశ్నకు సెన్సార్ టవర్స్ రిపోర్ట్ అవుననే సమాధానం చెబుతోంది. దాని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ స్క్రీన్ వినియోగంలో భారత్ తొలిస్థానంలో ఉంది. 2024లో భారత్ ఏకంగా 1.12 ట్రిలియన్ల గంటలు మొబైల్ ఫోన్లో గడిపిందని రిపోర్ట్ తెలిపింది. మనదేశంలో ఆన్లైన్ స్క్రీన్ వినియోగంలో 13% వృద్ధి కనిపిస్తే, అమెరికాలో 0.6% తగ్గింది. దీంతో ఓ టైమ్ నిర్దేశించుకొని మొబైల్ చూడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
News February 4, 2025
తల్లి బతికుండగానే పెద్దకర్మ భోజనాలు.. ఎందుకంటే?
AP: తల్లి బతికుండగానే కుమారులు పెద్దకర్మ భోజనాలు పెట్టిన ఘటన కృష్ణా(D) పెడన(M) ముచ్చర్లలో జరిగింది. రంగమ్మ(80) తన ఆస్తిని కుమారులకు రాసేశారు. చనిపోయాక కొడుకులు పెద్దకర్మ భోజనాలు పెడతారో? లేదో? అని డౌట్ వచ్చింది. దీంతో బతికుండగానే ఆ కార్యక్రమం చేయాలని కుమారులను ఆమె కోరింది. తొలుత వారు షాక్కు గురైనా, ఆమె ఒత్తిడితో చివరకు బంధువులు, గ్రామస్థులను పిలిచి భోజనాలు వడ్డించారు. దీంతో రంగమ్మ సంతోషించారు.