News February 4, 2025
చారకొండ: బందోబస్తు మధ్య కూల్చివేతలు

చారకొండ మండల కేంద్రంలో 167 జాతీయ రహదారి నిర్మాణం కోసం గ్రామంలోని ఊరి మధ్య రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను జేసిబీలతో ఇళ్లను తొలగించారు. తొలగింపు కార్యక్రమాన్ని తహశీల్దార్ సునీత, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓ ఇసాక్ హుస్సేన్ కూల్చివేతలు పర్యవేక్షించారు.
Similar News
News July 7, 2025
అనంతగిరి: సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలి

అల్లూరి జిల్లాలో 700 మంది సీహెచ్ డబ్ల్యూలు పనిచేస్తున్నారని, వారందరినీ ఆశా కార్యకర్తలుగా మార్చాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు కోరారు. ఆదివారం అనంతగిరి మండలంలో పర్యటించిన డీఎంహెచ్‌వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడును ఆయన కలిశారు. సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలని విన్నవించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు.
News July 7, 2025
పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు.
News July 7, 2025
ఒంగోలు IIITలో 184 సీట్లు ఖాళీ

ఒంగోలు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 826 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 184 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.