News February 4, 2025

ములుగు: తుడందెబ్బ మొదటి మహిళా అధ్యక్షురాలి మృతి

image

తుడుందెబ్బ మొదటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండేల మల్లక్క మంగళవారం మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ అస్తిత్వం కోసం పోరాటం చేసి, ఆదివాసులకు హక్కులు కల్పించడంలో ఆమె ఎంతో కృషి చేశారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. మల్లక్క మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటన్నారు. ఆంధ్ర వలసదారులపై పోరాటం చేసి వెయ్యి ఎకరాల భూమిని ప్రజలకు పంచిదన్నారు.

Similar News

News February 4, 2025

అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్

image

అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్  రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.

News February 4, 2025

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం

image

ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన NCAలో ఉన్నారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.

News February 4, 2025

MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

మంచిర్యాల రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 25 ఏళ్లుంటుందన్నారు. నలుపు టీ షర్ట్, యాష్ రంగు ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. చేతిపై మామ అని టాటూ ఉందని జీఆర్పీ SI మహేందర్, హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

error: Content is protected !!