News March 19, 2024
NDA కూటమిలో చేరనున్న MNS?
మహారాష్ట్రలోని MNS(మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) పార్టీ NDA కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు MNS చీఫ్ రాజ్ థాక్రేకి, BJP సీనియర్ లీడర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్ థాక్రే తన కుమారుడు అమిత్ థాక్రేతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు బంధువే ఈ రాజ్ థాక్రే. ఆయన శివసేనను వీడి 2006లో MNSను స్థాపించారు.
Similar News
News January 9, 2025
తొక్కిసలాట చాలా బాధాకరం: జగన్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై YCP చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
News January 8, 2025
మూడు గ్రామాలను వణికిస్తోన్న బట్టతల సమస్య
MH బుల్దానాలోని బోర్గాం, కల్వాడ్, హింగానా గ్రామాల ప్రజలను జుట్టు రాలుడు సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మందికి జుట్టు రాలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామాల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. దాదాపు 50 మంది ఈ సమస్యతో వైద్యులను సంప్రదించగా బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కాగా కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
News January 8, 2025
వైకుంఠ దర్శనం కోరితే వైకుంఠానికి పంపుతారా: VHP
తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.