News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
Similar News
News September 14, 2025
కాల్ 1100ను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని SSS కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100కి కాల్ చేయవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.
News September 14, 2025
లోక్ అదాలత్ ద్వారా 4625 కేసులు పరిస్కారం: CP

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 4625 కేసులు పరిష్కారమయ్యాయని CP సునీల్ దత్ తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 4625 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు 712, ఈ పెటీ కేసులు 775, డ్రంకన్ & డ్రైవ్ కేసులు 2972, మైనర్ డ్రైవర్ కేసులు 8, సైబర్ కేసులు 158 పరిష్కరించడం ద్వారా రూ.52,11,246 బాధితులకు అందజేశారన్నారు.
News September 14, 2025
ప్రముఖ శాస్త్రవేత్త రోహిణీప్రసాద్ మన తెనాలి వారే

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, కొడవటిగంటి రోహిణీప్రసాద్ 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రేడియో యాక్టివిటీ పరికరాలపై పరిశోధన మీద బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు.