News February 4, 2025

ఆర్మూర్: మెరుగైన వైద్య సేవలందించాలి: DMHO

image

నిజామాబాద్ జిల్లా DMHO రాజశ్రీ మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆసుపత్రి రిజిస్టర్లను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్, డాక్టర్ ప్రవీణ్, ఆనంద్, LT కృష్ణ, ఫార్మసిస్టు సురేశ్, తదితరులు ఉన్నారు.

Similar News

News March 14, 2025

NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి 

image

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.

News March 14, 2025

బోధన్: కోచింగ్ లేకుండా GOVT జాబ్ సాధించారు..!

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ వాసి గుడ్ల సాయిప్రసాద్ బోధన్ జూనియర్ కాలేజీలో కెమిస్ట్రీ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. ఎలాంటి కోచింగ్ సెంటర్ వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో పాఠాలు విని జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి సునీత, సోదరి ప్రియాంక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు సాయిప్రసాద్ తెలిపారు.

News March 14, 2025

నిజామాబాద్‌: మనిషి పుర్రె, ఎముకల కలకలం 

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల శివారులో గురువారం మనిషి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. గాంధీనగర్‌కి చెందిన వ్యక్తులు పని నిమిత్తం బినోల శివారు అడవిలోకి వెళ్లగా మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయన్నారు. గాంధీనగర్ కారోబార్ చింతల మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో స్థానికంగా ఎవరైనా అదృశ్యమయ్యారా విచారణ చేస్తామన్నారు.

error: Content is protected !!