News February 4, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018, 2019 ఎడ్మిట్ విద్యార్థుల మొదటి, మూడో సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ ఫిబ్రవరి 17 నుంచి 28వ తేదీ వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
Similar News
News February 4, 2025
అరసవల్లి: భక్తుల రాకపోకలను పరిశీలించిన కలెక్టర్
అరసవల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా భక్తుల సందర్శన, రాకపోకలను శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వీ.మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం పరిశీంచారు. ఇంద్రపుష్కరిణిని పరిశీలించి అక్కడ భవిష్యత్తులో చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు.
News February 4, 2025
శ్రీకాకుళం: 6న విజయ గౌరీ నామినేషన్
శ్రీకాకుళంలోని UTF భవనంలో సంబంధిత టీచర్ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఫిబ్రవరి 6న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ నామినేషన్ వేస్తారని చెప్పారు. ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్ మూర్తి, సహాధ్యక్షులు ధనలక్ష్మి,రవికుమార్ పాల్గొన్నారు.
News February 4, 2025
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి: విశాఖ డీఐజీ
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో బందోబస్తు విధులు నిర్వహణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.